హోం మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలిపిన రైతులు

ABN , First Publish Date - 2020-12-01T19:05:35+05:30 IST

అంబాలాలోని పంజోఖ్రా సాహిబ్ గురుద్వారా వెలుపల హోం మంత్రికి వ్యతిరేకంగా హర్యనా రైతులు నల్లజెండాలు ప్రదర్శిస్తూ..

హోం మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలిపిన రైతులు

అంబాలా: హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌కు రైతుల నిరసన సెగ తగలింది. అంబాలాలోని పంజోఖ్రా సాహిబ్ గురుద్వారా వెలుపల ఆయనకు వ్యతిరేకంగా హర్యనా రైతులు నల్లజెండాలు ప్రదర్శిస్తూ, రైతు ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మంత్రి కారును అడ్డుకుంటూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో అనిల్ విజ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.


'పంజాబ్ రైతులు మా కామ్రేడ్లే. హర్యానా నుంచి మా రైతులెవరూ నిరసనల్లో పాల్గొనడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ కారణంగానే బీజేపీ నేతకు, కేంద్ర ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నాం. నల్ల జెండాలతో మా అసంతృప్తిని వెలిబుచ్చుతున్నాం' అని నల్లజెండాల నిరసనలో పాల్గొన్న రైతు ఒకరు తెలిపారు. కాగా, పంజాబ్‌‌లో అంతర్గత రాజకీయాల్లో భాగంగానే అక్కడి రైతులు వ్యవసాయ చట్టాలపై నిరసనలు తెలుపుతున్నారంటూ అనిల్ విజ్ ఇటీవల వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-01T19:05:35+05:30 IST