హ‌రియాణాలో స్వ‌ల్ప‌ భూకంపం

ABN , First Publish Date - 2020-06-18T11:23:19+05:30 IST

ఉత్తర భారతదేశంలో ఇటీవ‌లికాలంలో ప‌లుమార్లు భూకంప ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు తెల్ల‌వారు జామున‌ హరియాణాలోని...

హ‌రియాణాలో స్వ‌ల్ప‌ భూకంపం

రోహ్‌త‌క్‌: ఉత్తర భారతదేశంలో ఇటీవ‌లికాలంలో ప‌లుమార్లు భూకంప ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు తెల్ల‌వారు జామున‌ హరియాణాలోని రోహ్‌తక్‌లో భూకంపం సంభ‌వించింది. అయితే దీని తీవ్రత త‌క్కువగా ఉన్న కారణంగా ఎటువంటి ప్ర‌మాదం చోటుచేసుకోలేదు. ఇటీవ‌లికాలంలో జమ్మూక‌శ్మీర్, ఢిల్లీ, గుజరాత్‌ల‌లో స్వ‌ల్ప భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. రోహ్‌త‌క్‌కు 15 కిలోమీటర్ల దూరంలో సంభ‌వించిన ఈ భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.1గా న‌మోద‌య్యింది. ఇది చాలా తక్కువ తీవ్ర‌త ‌కావ‌డంలో ఎటువంటి నష్టం జరిగినట్లు స‌మాచారం లేదు. కాగా గుజరాత్‌లో ఆదివారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని ఢిల్లీలో కూడా గత రెండు నెలల్లో 11సార్లు భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. 


Updated Date - 2020-06-18T11:23:19+05:30 IST