విదేశీ ప్రయాణికులపై ప్రత్యేకదృష్టి సారించాం: హర్షవర్థన్‌

ABN , First Publish Date - 2020-03-02T22:38:02+05:30 IST

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని..

విదేశీ ప్రయాణికులపై ప్రత్యేకదృష్టి సారించాం: హర్షవర్థన్‌

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్రమంత్రి హర్షవర్థన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ ప్రయాణికులపై ప్రత్యేకదృష్టి సారించామన్నారు. 12 దేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. విమానాశ్రయాలు, ఓడరేవుల దగ్గర వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 15 ల్యాబ్‌లలో కరోనా వైరస్‌ నమూనాలను పరీక్షిస్తున్నామని హర్షవర్థన్‌ అన్నారు.

Updated Date - 2020-03-02T22:38:02+05:30 IST