చైనాపై తీవ్రంగా మండిపడ్డ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

ABN , First Publish Date - 2020-05-29T18:27:14+05:30 IST

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చైనా తీరుపై ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా

చైనాపై తీవ్రంగా మండిపడ్డ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్  చైనా తీరుపై ట్విట్టర్ వేదికగా  తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాను వ్యాపింప చేసి, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతోందని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు.


‘‘మే 28 వరకూ తమ దేశంలో కొత్త కరనో కేసులు నమోదు కాలేదని చైనా ప్రకటించింది. చైనా అధికార దాహంతోనే ఇలా ప్రవర్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాను వ్యాప్తి చేసి, పీపీఈ కిట్లు, మాస్కులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ వారి ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసుకునే పనిలో నిమగ్నమైంది’’ అని తీవ్రంగా ధ్వజమెత్తారు.


ప్రపంచ వ్యాప్తంగా కరోనాను వ్యాప్తి చేసి, చైనా రాక్షసానందాన్ని పొందుతోందని, పీపీఈ కిట్లు, మాస్కులను పంపిణీ చేస్తూ వారి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటోందని, ఇదే వారి వ్యూహమని హర్భజన్ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-05-29T18:27:14+05:30 IST