హంటా వైరస్‌తో చైనాలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-03-25T08:07:40+05:30 IST

కరోనా వైరస్‌ పేరు వినగానే ప్రజలు వణికిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మరో వైర్‌సపై చర్చకు తెరలేచింది. దానిపేరే ‘హంటావైరస్‌’. దీని బారినపడిన ఓ వ్యక్తి సోమవారం చైనాలోని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌

హంటా వైరస్‌తో చైనాలో ఒకరి మృతి

కొత్త బూచి వచ్చిందంటూ నెట్టింట వదంతులు


బీజింగ్‌, మార్చి 24: కరోనా వైరస్‌ పేరు వినగానే ప్రజలు వణికిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మరో వైర్‌సపై చర్చకు తెరలేచింది. దానిపేరే ‘హంటావైరస్‌’. దీని బారినపడిన ఓ వ్యక్తి సోమవారం చైనాలోని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి యున్నాన్‌ ప్రావిన్స్‌ బస్సులో వెళ్తుండగా మృత్యువాతపడ్డాడు. అతడికి కరోనా ఉండొచ్చని తొలుత అనుమానించినప్పటికీ.. వైద్యపరీక్షల్లో అతడికి ‘హంటావైరస్‌’ సోకినట్లు తేలింది. దీంతో ఆ బస్సులో మిగతా 32 మంది ప్రయాణికులకూ హుటాహుటిన వైద్యపరీక్షలు నిర్వహించగా, ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించలేదు. ఈమేరకు వివరాలతో చైనాలోని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ వెబ్‌సైట్‌ చేసిన ట్వీట్‌పై ‘నెట్టి’ంట తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి హంటావైరస్‌ పాతదే. 1993లోనే దీనికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. ఇది ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది.  

Read more