సగం మంది పిల్లలకు టీకాలు వేయలేదు

ABN , First Publish Date - 2020-05-18T08:52:18+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఐదేళ్లలోపు వయసు పిల్లలున్న తల్లిదండ్రులలో సగం మంది తమ సంతానానికి వ్యాధి నిరోధక టీకాలు, చుక్కల మందులు వేయించలేకపోయారు. బాలల హక్కులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ...

సగం మంది పిల్లలకు టీకాలు వేయలేదు

  • లాక్‌డౌన్‌లో బాలలపై సర్వే 


న్యూఢిల్లీ, మే 17: లాక్‌డౌన్‌ కారణంగా ఐదేళ్లలోపు వయసు పిల్లలున్న తల్లిదండ్రులలో సగం మంది తమ సంతానానికి వ్యాధి నిరోధక టీకాలు, చుక్కల మందులు వేయించలేకపోయారు. బాలల హక్కులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ  ‘క్రై’ ఇటీవల జరిపిన విస్తృత సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  మొదటి, రెండో విడత లాక్‌డౌన్‌ సమయంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే జరిపింది. ఐదేళ్లలోపు వయసు పిల్లలున్న తల్లిదండ్రులలో దాదాపు 51 శాతం మందే తమ పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, చుక్కల మందులు వేయించుకోగలిగారు. అలాగే లాక్‌డౌన్‌ కాలంలో తమ పిల్లలకు రెగ్యులర్‌ వైద్య సదుపాయం కూడా లభించలేదని సర్వేలో పాల్గొన్న 27 శాతంమంది తల్లిదండ్రులు చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల తమ పిల్లల చదువులు దెబ్బతిన్నాయని సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు(77 శాతం) చెప్పారు. 

Updated Date - 2020-05-18T08:52:18+05:30 IST