హలాల్ మాంసం బహిష్కరణ
ABN , First Publish Date - 2020-12-17T07:49:15+05:30 IST
మరికొద్ది రోజుల్లో క్రిస్‌మస్ అనగా కేరళలోని క్రైస్తవ సమాజం కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ చేసిన మాంసాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది.

కేరళలోని క్రైస్తవ సమాజం నిర్ణయం
తిరువనంతపురం, డిసెంబరు 16: మరికొద్ది రోజుల్లో క్రిస్‌మస్ అనగా కేరళలోని క్రైస్తవ సమాజం కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ చేసిన మాంసాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. ఇతర మతాల దేవుళ్లకు నైవేద్యంగా పెట్టిన ఆహార పదార్థాలను తాము స్వీకరించమని, అందుకే హలాల్ మాంసాన్ని ఇకపై తీసుకోవొద్దని నిర్ణయించామని ప్రకటించింది. మాంసం కోసం తామే జంతువులను కొనుగోలు చేసి, హలాల్ రహితంగా వధిస్తామని ప్రకటించాయి.
ఈ నిర్ణయాన్ని ‘హిందూ ఐక్య వేదిక’ లాంటి హిందూ సంస్థలు స్వాగతించాయి. హలాల్ మాంసాన్ని బహిష్కరించడమంటే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వివాదాన్ని రాజేయడమేనని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) భగ్గుమంది.