కాంగ్రెస్‌లో మాజీ ఐఏఎస్ అధికారి భార్య
ABN , First Publish Date - 2020-10-04T21:03:37+05:30 IST
కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్..
బెంగళూరు: దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి భార్య హెచ్.కుసుమ ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఐఏఎస్ అధికారి అయిన డీకే రవి 2015లో కోరమంగళలోని తన నివాసంలో ఆత్యహత్య చేసుసుకున్నారు. కాగా, రాజరాజేశ్వరి నగర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుసుమ పోటీ చేసే అవకాశాలున్నాయి.