జీవీఎల్‌వి అసంబద్ధ వ్యాఖ్యలు: రఘురామ
ABN , First Publish Date - 2020-08-20T07:43:07+05:30 IST
‘‘ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి. ఈ అంశంతో కేంద్రానికి సంబంధంలేదని ఆయన అనడం సరైంది కాదు. ఫోన్‌ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కిందకు వస్తుంది’’ అని వైసీపీ నరసాపురం...

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి. ఈ అంశంతో కేంద్రానికి సంబంధంలేదని ఆయన అనడం సరైంది కాదు. ఫోన్‌ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కిందకు వస్తుంది’’ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
ఫోన్‌ట్యాపింగ్ అంశంపై ప్రధానికి లేఖ రాసిన ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించి ఉండొచ్చన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోమంటూ చంద్రబాబు...దేశ ప్రధానికి లేఖ రాయడాన్ని పరోక్షంగా సమర్థించారు. ‘‘రాజస్థాన్‌లో ఒక విధానం, కర్ణాటకలో ఒకవిధానం, ఏపీలో మరొక విధానం నాకు తెలిసి బీజేపీకి ఉండవు’’ అని వివరించారు. ఇసుక అక్రమాలపై స్పందించినట్టే....ఆవ భూముల స్కాంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కొవిడ్-19 నియమ నిబంధనలకు లోబడి వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ సీఎంకు రఘురామ లేఖ రాశారు.