గుజరాత్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 256 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-26T02:23:09+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ రెండో స్థానానికి చేరుకుంది. గత 24 గంటల్లోనే...

గుజరాత్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 256 కరోనా కేసులు

గాంధీనగర్: దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ రెండో స్థానానికి చేరుకుంది. గత 24 గంటల్లోనే 256 కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయంటే గుజరాత్‌లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందిస్తూ, కొత్తగా నమోదైన 256 పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,071కి చేరిందని, 133 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారని వెల్లడించింది. కాగా.. 282 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

Updated Date - 2020-04-26T02:23:09+05:30 IST