గుజరాత్‌లో మరో 239 మందికి కరోనా.. 2 వేలు దాటిన కేసులు..

ABN , First Publish Date - 2020-04-22T03:53:10+05:30 IST

గుజరాత్‌లో కొవిడ్-19 మహమ్మారి రోజు రోజుకూ మరింత విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 239 మందికి కొత్తగా...

గుజరాత్‌లో మరో 239 మందికి కరోనా.. 2 వేలు దాటిన కేసులు..

అహ్మదాబాద్: గుజరాత్‌లో కొవిడ్-19 మహమ్మారి రోజు రోజుకూ మరింత విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 239 మందికి కొత్తగా కరోనా సోకినట్టు గుర్తించామని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి గుజరాత్‌లో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,178కి చేరినట్టు తెలిపారు. కొత్తగా నమోదైన 239 కరోనా కేసుల్లో అత్యధికంగా అహ్మదాబాద్ నుంచి 130 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. సూరత్‌లో 78, వడోదరలో 6, అరవల్లి, బనస్కాంత ప్రాంతాల్లో ఐదేసి చొప్పన ఇవాళ కొత్త కేసులు నమోదయ్యాయి. వల్సాద్‌లో ముగ్గురు, బటద్, రాజ్‌కోట్‌లలో ఇద్దరేసి చొప్పన, మెహ్సానా, భరుచ్, దహోద్, సబర్కాంత, నవ్సారీ, గిర్ సోమనాథ్, ఖేదా, తాపి ప్రాంతాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా బారిన పడ్డారు. 


కాగా ఇవాళ మరో ఎనిమిది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో.... ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 189కి చేరిందని ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్) జయంతి రవి పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 1949 మందిలో 14 మందికి వెంటిలేటర్‌‌పై చికిత్స అందిస్తున్నామన్నారు.

Updated Date - 2020-04-22T03:53:10+05:30 IST