కరోనా రిపోర్ట్: గుజరాత్‌లో 500కు పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-19T03:15:05+05:30 IST

గుజరాత్‌లో నేడు 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 26,000కు...

కరోనా రిపోర్ట్: గుజరాత్‌లో 500కు పైగా కరోనా కేసులు

గాంధీనగర్: గుజరాత్‌లో నేడు 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 26,000కు చేరువయింది. తాజా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 510 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,660కి చేరింది. వీరిలో 6,408మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 17,829మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  1,592 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-19T03:15:05+05:30 IST