కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కరోనా.. సీఎంను కలిసిన కొద్ది గంటలకే..

ABN , First Publish Date - 2020-04-15T20:05:00+05:30 IST

ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. కొవిడ్-19పై ముఖ్యమంత్రి...

కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కరోనా.. సీఎంను కలిసిన కొద్ది గంటలకే..

గాంధీనగర్: గుజరాత్‌‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. కొవిడ్-19పై సీఎం విజయ్‌ రూపానీతో సమావేశమైన కొద్ది గంటలకే ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అంటూ ఫలితాలు రావడంతో తీవ్ర కలవరం రేగింది. సదరు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న జమల్‌పూర్ ఖదియా... కొవిడ్-19 హాట్‌స్పాట్‌గా గుర్తించిన అహ్మదాబాద్‌ పరిధిలోనిదే కావడం గమనార్హం.


అహ్మదాబాద్‌లో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్య  శాఖ అధికారులు ఇక్కడ నిఘా పెంచడంతో పాటు ఈ ప్రాంతమంతా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారం రోజుల పాటు కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానిక ప్రజల్లో తిరిగారు. అయితే ఆయనకు నిన్న సాయంత్రం కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించడంతో... హుటాహుటిన ఎస్‌వీపీ ఆస్పత్రిలో చేరారు. కాగా దీనికి కొద్ది గంటల ముందే సీఎం విజయ్ రూపానీతో పాటు, కేంద్రం హోంశాఖ సహాయమంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను సైతం ఆ ఎమ్మెల్యే కలుసుకున్నారు. అనంతరం మీడియాతో కూడా కొద్దిసేపు మాట్లాడారు.  

Updated Date - 2020-04-15T20:05:00+05:30 IST