గుజరాత్‌లో వలస కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-04-12T07:54:53+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. తమను సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయేందుకు అనుమతించాలని ఆందోళన చేశారు. సూరత్‌లో చిక్కుకుపోయిన...

గుజరాత్‌లో వలస కార్మికుల ఆందోళన

సూరత్‌ (గుజరాత్‌), ఏప్రిల్‌ 11: లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. తమను సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయేందుకు అనుమతించాలని ఆందోళన చేశారు. సూరత్‌లో చిక్కుకుపోయిన వందలాది వలస కార్మికులు శుక్రవారం రాత్రి లాక్‌డైన్‌ నిబంధనలు బేఖాతరు చేసి రోడ్లమీదకు వచ్చారు. తమకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించి.. తమను పంపించేసే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన జరిగిన రోజే గుజరాత్‌లో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు పెరిగాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-12T07:54:53+05:30 IST