అహ్మ‌దాబాద్‌లో 7 రోజుల్లో 709 సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌ ఆచూకీ!

ABN , First Publish Date - 2020-05-17T14:33:22+05:30 IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మహారాష్ట్ర తరువాత క‌రోనాకు అత్య‌ధికంగా ప్ర‌భావిత‌మైన గుజ‌రాత్‌లో కరోనా రోగుల సంఖ్య 11 వేలకు చేరుకుంది. శ‌నివారం ఒక్క....

అహ్మ‌దాబాద్‌లో 7 రోజుల్లో 709 సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌ ఆచూకీ!

అహ్మదాబాద్: ‌దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మహారాష్ట్ర తరువాత  క‌రోనాకు అత్య‌ధికంగా ప్ర‌భావిత‌మైన గుజ‌రాత్‌లో కరోనా రోగుల సంఖ్య 11 వేలకు చేరుకుంది. శ‌నివారం ఒక్క‌ రోజులో కొత్తగా 1057 కేసులు న‌మోదుకావ‌డంతో రాష్ట్రంలో మొత్తం రోగుల సంఖ్య‌ 10,989కు చేరింది. అలాగే 709 సూపర్ స్ప్రెడర్స్ ఆచూకీ కూడా తెలిసింది. 7 రోజుల వ్య‌వ‌ధిలో అహ్మ‌దాబాద్‌లో మొత్తం 709 సూపర్ స్ప్రెడర్స్ ఆచూకీ వెల్ల‌డ‌య్యింది. గుజ‌రాత్‌లో కరోనా వైరస్ కారణంగా మరో 19 మంది మృతి చెందార‌ని ప్రిన్సిపల్ సెక్రటరీ జయంతి రవి తెలిపారు. సూపర్ స్ప్రెడర్లు వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ వ్యాపింప‌జేస్తారు. రాష్ట్రంలో సుమారు 35 వేల సూపర్ స్ప్రెడర్లను షార్ట్‌లిస్ట్ చేయ‌గా, 12,500 మందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీరిలో 709 మంది పాజిటివ్‌గా తేలారు. వీరిని ఐసోలేషన్ కేంద్రానికి త‌ర‌లించారు. పెద్ద సంఖ్యలో దుకాణదారులు, కూరగాయల విక్రేత‌ల‌ను విచారించిన తరువాత ఈ 709 సూపర్ స్ప్రెడర్ల‌ను క‌నుగొన్నారు. మ‌రోవైపు ఇన్‌ఫెక్షన్ నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ 273 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

Updated Date - 2020-05-17T14:33:22+05:30 IST