కోవిడ్ చికిత్స సమయంలో హైకోర్టు న్యాయమూర్తి గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2020-12-05T22:55:39+05:30 IST

కోవిడ్ చికిత్స సమయంలో హైకోర్టు న్యాయమూర్తి గుండెపోటుతో మృతి

కోవిడ్ చికిత్స సమయంలో హైకోర్టు న్యాయమూర్తి గుండెపోటుతో మృతి

గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ జీఆర్ ఉధ్వానీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా వైరస్ చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారని వైద్య అధికారి పేర్కొన్నారు.


59 ఏళ్ల వయసు ఉన్న జస్టిస్ ఉధ్వానీకి నవంబర్ 19న కోవిడ్-19 పరీక్ష చేయడంతో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కరోనా సంక్రమణ వల్ల తలెత్తే సమస్యల కారణంగా ఆయన మరణించాడని, జస్టిస్ ఉధ్వానీ హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నాడని డాక్టర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-05T22:55:39+05:30 IST