బీజేపీ ప్రభుత్వంపై అహ్మద్ పటేల్ కామెంట్స్..

ABN , First Publish Date - 2020-06-16T23:08:49+05:30 IST

బీజేపీ ప్రభుత్వంపై అహ్మద్ పటేల్ కామెంట్స్..

బీజేపీ ప్రభుత్వంపై అహ్మద్ పటేల్ కామెంట్స్..

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఖర్చులను తగ్గించుకోవడంపై అహ్మద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ సగటున 400 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం వైద్య ఖర్చులను తగ్గించుకోవడం ఎంతవరకు సమంజసమని పటేల్ అన్నారు. బీజేపీ సర్కారు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోందని గుజరాత్ కు చెందిన రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్  విమర్శించారు.


Updated Date - 2020-06-16T23:08:49+05:30 IST