ప్లాంట్‌లో గ్యాస్ లీక్... నలుగురు మృతి!
ABN , First Publish Date - 2020-07-19T11:46:05+05:30 IST
గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని ధోలి గ్రామంలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో నలుగురు మృతిచెందారు. సిమెజ్ సమీపంలో ఉన్న చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది.

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని ధోలి గ్రామంలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో నలుగురు మృతిచెందారు. సిమెజ్ సమీపంలో ఉన్న చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాలతో నిండిన ట్యాంక్ శుభ్రం చేయడానికి కార్మికులు ట్యాంక్‌లోకి దిగినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ నితేష్ పాండే తెలిపారు. అయితే లోపలి నుంచి వెలువడిన విష వాయువుల కారణంగా నలుగురు కార్మికులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.