సీఎంను మార్చాలని వార్త రాసిన న్యూస్ పోర్టల్ ఎడిటరుపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-05-13T13:03:13+05:30 IST

సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చాలని వార్త రాసిన న్యూస్ పోర్టల్ ఎడిటరుపై క్రైంబ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన...

సీఎంను మార్చాలని వార్త రాసిన న్యూస్ పోర్టల్ ఎడిటరుపై పోలీసు కేసు

సూరత్ (గుజరాత్): కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విఫలమైనందు వల్ల సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చాలని వార్త రాసిన న్యూస్ పోర్టల్ ఎడిటరుపై క్రైంబ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగుచూసింది. ఫేస్ ఆఫ్ నేషన్ అనే గుజరాతీ న్యూస్ పోర్టల్ కు ధావల్ పటేల్ ఎడిటరుగా పనిచేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో సీఎం విజయ్ రూపానీ విఫలమైనందు వల్ల అతన్ని తొలగించి అతనిస్థానంలో కేంద్రమంత్రి మాన్సుఖ్ మాండవీయను నియమించాలని బీజేపీ అధిష్ఠానవర్గానికి సూచిస్తూ ఎడిటర్ ధావల్ పటేల్ తన న్యూస్ పోర్టల్‌లో ఓ కథనం రాశారు. గుజరాత్ లో కరోనాను కట్టడి చేయడంలో సీఎం విజయ్ రూపానీ విఫలమయ్యాడని బీజేపీ అధిష్ఠానవర్గం అసంతృప్తిగా ఉందని, దీనిపై మాట్లాడేందుకు కేంద్రమంత్రి మాండవీయను బీజేపీ అధిష్ఠానం పిలిచిందని రాశారు. దీనిపై దర్యాప్తు చేసిన అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు ధావల్ పటేల్ పై ఐపీసీ సెక్షన్ 124 ఎ, కింద కేసు  నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకొని కరోనా పరీక్షలు చేసేందుకు ఆసుపత్రికి తరలించామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ బీవీ గోహిల్ చెప్పారు. 

Read more