రైలులో యువ‌కుని మృతి...పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూపు!

ABN , First Publish Date - 2020-05-10T11:35:55+05:30 IST

లా‌క్‌డౌన్ నేప‌ధ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది కార్మికులు గుజరాత్‌లో చిక్కుకున్నారు. కాగా గుజరాత్‌లోని భావ్‌నగర్ నుండి ప్ర‌త్యేక‌ రైలులో ప్ర‌యాణిస్తున్న‌ 29 ఏళ్ల యువకుడు మృతిచెందాడు.

రైలులో యువ‌కుని మృతి...పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూపు!

గాంధీన‌గ‌ర్‌: లా‌క్‌డౌన్ నేప‌ధ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది కార్మికులు గుజరాత్‌లో చిక్కుకున్నారు. కాగా గుజరాత్‌లోని భావ్‌నగర్ నుండి ప్ర‌త్యేక‌ రైలులో ప్ర‌యాణిస్తున్న‌ 29 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. మృతుడి పేరు కన్హయ్య లాల్. సీతాపూర్‌లోని తల్గావ్ ప్రాంతానికి చెందిన‌వాడు.  రైలులో పైబెర్త్ మీద నిద్రిస్తూ, అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందాడు. లక్నోలో రైలు ఆగిన తరువాత మృతదేహాన్ని బ‌య‌టకు తీశారు. ఈ రైలు నేరుగా భావ్‌నగర్ నుండి టౌన్‌షిప్‌కు వెళుతున్నందున అది మరెక్కడా ఆగలేదు.  పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. మృతుని కుటుంబానికి స‌మాచారం అందించారు. ఇంతవరకు ఆ యువ‌కుని మృతికి గ‌ల కార‌ణం వెల్ల‌డికాలేదు. పోస్టుమార్టం రిపోర్టు వ‌చ్చిన త‌రువాతే అన్ని వివ‌రాలు తెలుస్తాయ‌ని పోలీసులు తెలిపారు. కాగా కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఇప్పటివరకు ఇక్క‌డ‌ మొత్తం 7,402 మంది కరోనా వైరస్ బారిన ప‌డ్డారు. 1,872 మంది చికిత్స తర్వాత కోలుకున్నారు. కరోనా వైరస్ కారణంగా 449 మంది మృతి చెందారు. 

Updated Date - 2020-05-10T11:35:55+05:30 IST