పెళ్ళికి పెన్ను తప్పనిసరి... ఫొటోకు మాస్కు మినహాయింపు!

ABN , First Publish Date - 2020-04-26T13:04:51+05:30 IST

కరోనా వచ్చి మన జీవన విధానాన్ని మార్చివేసింది. సంక్రమణను నివారించడానికి, సామాజిక దూరం మొదలుకొని, మాస్కులు ధరించడం వరకు ప్రభుత్వం...

పెళ్ళికి పెన్ను తప్పనిసరి... ఫొటోకు మాస్కు మినహాయింపు!

ముంబై: కరోనా వచ్చి మన జీవన విధానాన్ని మార్చివేసింది. సంక్రమణను నివారించడానికి, సామాజిక దూరం మొదలుకొని, మాస్కులు ధరించడం వరకు ప్రభుత్వం పలు నియమాలను రూపొందిస్తోంది. తాజాగా  ముంబై రిజిస్ట్రార్ కార్యాలయానికి  పెళ్లి చేసుకునేందుకు వచ్చే వచ్చే జంటలు  తమ వెంట పెన్ను తీసుకురావాలని కోరింది. అలాగే  వివాహం సమయంలో ఐదుగురు మాత్రమే హాజరుకావాలని తెలిపింది. వివాహ నమోదు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది. లాక్డౌన్ ముగిసిన తర్వాతే వివాహ నమోదు ప్రారంభమవుతుందని కూడా పేర్కొంది.  నూతన నిబంధనల ప్రకారం కొత్త జంటలు ఫోటో తీసుకునేందుకు కొన్ని నిముషాలపాటు మాస్కులు తొలగించడానికి అనుమతిస్తారు. 

Updated Date - 2020-04-26T13:04:51+05:30 IST