పోలీసులుగా మారిన డ్రైవర్లు, కండక్టర్లు

ABN , First Publish Date - 2020-04-15T14:35:50+05:30 IST

గుజరాత్ లోని సూరత్‌ కుచెందిన బార్డోలిలో జీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల పాత్రను పోషిస్తున్నారు. బర్డోలి పోలీసులు లాక్డౌన్...

పోలీసులుగా మారిన డ్రైవర్లు, కండక్టర్లు

సూరత్: గుజరాత్ లోని సూరత్‌ కుచెందిన బార్డోలిలో జీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల పాత్రను పోషిస్తున్నారు. బర్డోలి పోలీసులు లాక్డౌన్ సమయంలో జీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు అనుమతి కోసం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ విజయ్ రబారీని సంప్రదించారు. దీనికి ఆయన అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా  బార్డోలి పోలీస్ ఇన్ స్పెక్టర్ ఎంఎం గిలాటర్ మాట్లాడుతూ మేము సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నామని, అందుకే  జీఎస్‌ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ను సంప్రదించామన్నారు. ఈ నేపథ్యంలోనే  జీఎస్‌ఆర్‌టీసీ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, బార్డోలి పట్టణం చుట్టూ తిరిగేలా వారికి గుర్తింపు కార్డులను కేటాయించామన్నారు. జీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్ ప్రవీణ్ కులకర్ణి మీడియాతో  మాట్లాడుతూ ప్రతిరోజు తాను సూరత్, బార్డోలి మధ్య బస్సును నడిపేవాడినని, ఇప్పుడు పోలీసుగా విధులు నిర్వహించడం కొత్తగా ఉందన్నారు. 


Updated Date - 2020-04-15T14:35:50+05:30 IST