క్లినికల్ ట్రయల్స్‌కు ఆయుష్ మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2020-05-09T11:30:02+05:30 IST
కరోనా వైరస్ నివారణకు నాలుగు ఆయుర్వేద మందుల క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.....
కరోనా వైరస్ నివారణకు నాలుగు ఆయుర్వేద మందులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నివారణకు నాలుగు ఆయుర్వేద మందుల క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అశ్వగంధ, యష్టిమధు, గుడుచీ పిప్లీ, ఆయుష్ 64 మందుల క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దేశంలోని కరోనా పీడిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 50 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు సంజీవని యాప్ సాయంతో ఈ ఆయుర్వేద మందులు అందజేయనున్నారు. ఆయుర్వేద మందులపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్ లతో కలిసి అధ్యయనం చేయనున్నాయి. మన సంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదంలో కరోనా నివారణకు పనిచేసే మెరుగైన మందులున్నాయని దీనిపై తాము పరిశోధనలు చేస్తున్నామని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖఱ్ మండే చెప్పారు. కరోనా నివారణకు ఆయుర్వేద మందులు ఏమేర పనిచేస్తాయో పరిశోధించేందుకు యూజీసీతో కలిసి ఆయుష్ పరిశోధనా అభివృద్ధి మండలి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ భూషణ్ చెప్పారు. అశ్వగంధ, యష్టిమధు, గుడుచీ పిప్లీ, ఆయుష్ 64 మందులు పలు రోగాల నివారణకు సమర్ధంగా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెప్పారు.