వలసజీవులకు మంచి నిర్ణయం: నడ్డా

ABN , First Publish Date - 2020-05-18T08:23:44+05:30 IST

సొంతూళ్లకు తిరిగొస్తున్న వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మరో 40 వేలు కోట్లు కేటాయించిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. ఈ నిధులతో ఉపాధి హామీ పథకం కింద వలస కుటుంబాలకు...

వలసజీవులకు మంచి నిర్ణయం: నడ్డా

న్యూఢిల్లీ, మే 17: సొంతూళ్లకు తిరిగొస్తున్న వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మరో 40 వేలు కోట్లు కేటాయించిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. ఈ నిధులతో ఉపాధి హామీ పథకం కింద వలస కుటుంబాలకు పని కల్పిస్తారన్నారు. వలసజీవుల కోసం ప్రధాని మోదీ సకాలంలో తీసుకున్న మంచి నిర్ణయంగా అభివర్ణించారు. దీంతో గ్రామీణ ఆర్థిక రంగం బలోపేతమవుతుందని నడ్డా తెలిపారు.


రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రాలకు రూ.4.28 లక్షల కోట్ల మేర ఆర్థిక వనరులు సమకూరుతాయని వివరించారు. ‘కరోనా వైర్‌సతో సహజీవనం చేసే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. గ్రామాల్లో పనులు లేక పట్టణాలు, నగరాలకు ప్రజలు వలసపోతున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించి.. గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాలకు తీసుకెళ్లగలిగితేనే వలసలకు అడ్డుకట్ట పడుతుంది’ అని నడ్డా వివరించారు. 

Updated Date - 2020-05-18T08:23:44+05:30 IST