భారత వీవీఐపీలపై చైనా నిఘా.. కేంద్రం స్పందన ఏంటంటే..

ABN , First Publish Date - 2020-09-14T16:43:11+05:30 IST

భారత్ ప్రధాని, సైనికాధికారులు, ఇతర వీఐపీలపై చైనా గూఢచర్యానికి పాల్పడిందంటూ జాతీయ ఛానెల్ బయటపెట్టిన నేపథ్యంలో కేంద్రం తాజాగా స్పందించింది. ‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు’ అని సోమవారం నాడు వ్యాఖ్యానించింది.

భారత వీవీఐపీలపై చైనా నిఘా.. కేంద్రం స్పందన ఏంటంటే..

న్యూఢిల్లీ: భారత్ ప్రధాని, సైనికాధికారులు, ఇతర వీవీఐపీలపై చైనా గూఢచర్యానికి పాల్పడిందంటూ ఓ జాతీయ ఛానెల్ బయటపెట్టిన నేపథ్యంలో కేంద్రం తాజాగా స్పందించింది. ‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు’ అని సోమవారం నాడు వ్యాఖ్యానించింది. భారత నిఘా సంస్థలకు ఈ విషయంపై ముందుగానే సమాచారం ఉందని పేర్కొంది. ‘ఇటువంటి కారణాల రీత్యానేన చైనా యాప్‌లను నిషేధించాలనే నిర్ణయానికి వచ్చాము’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వ్యాఖ్యానించారు. ప్రధాని వంటి వీఐపీలకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సైతం భారత వ్యతిరేక కార్యకలాపాలకు శత్రు దేశాలు వినియోగించవచ్చని తెలిపారు. 


కాగా.. చైనాతో ఉద్రిక్తతల నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఘటనకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇలా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శుత్రుదేశ నిఘా సంస్థలు తమకు కావాల్సిన వివరాల్లో 80 శాతం దాకా రాబట్టగలవని అధికారులు చెప్పారు.  అదే సమయంలో.. ఈ వ్యవహారశైలి ప్రపంచ దేశాలకు మూమూలేనని కూడా వారు వ్యాఖ్యానించారు. ప్రతి దేశం.. ఇలాంటి సమాచారా విశ్లేషణ ద్వారానే ఇతర దేశాలపై ఓ కన్నేసి ఉంచుతుందన్నారు. అమెరికా అయితే సోషల్ మీడియా ద్వారా ఏకంగా 200 రకాల డాటా వివరాలను సేకరిస్తూ ఇతర దేశాలపై గట్టి నిఘా పెడుతుందన్నారు. 


Updated Date - 2020-09-14T16:43:11+05:30 IST