కరోనా భయమా?.. ఇదిగో హెల్ప్‌లైన్ నంబర్
ABN , First Publish Date - 2020-03-03T03:39:08+05:30 IST
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భారత్‌కు పాకింది. దేశరాజధాని ఢిల్లీలో, తెలంగాణలో కరోనా కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భారత్‌కు పాకింది. దేశరాజధాని ఢిల్లీలో, తెలంగాణలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా భయంతో ఆందోళన చెందుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా సంప్రదించడానికి ఓ హెల్ప్‌లైన్ నంబరును ఆయన ప్రకటించారు. కరోనా గురించి ఎటువంటి ఆందోళనలున్నా వెంటనే +91-11-23978046 నంబరుకు కాల్ చేయవచ్చని ఆయన తెలిపారు. అలాగే ఈమెయిల్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని తెలియజేశారు. దీనికోసం ncov2019@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు. ఈ హెల్ప్‌లైన్లో కరోనా కేసులు నమోదు చేసుకోచ్చని, వైరస్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే కరోనా రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి కూడా ఈ హెల్ప్‌లైన్ ద్వారా సూచనలు తీసుకోవచ్చని స్పష్టంచేశారు. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ట్వీట్ చేసింది. ఈ వివరాలను సాధ్యమైనంత మందికి చేరవేయాలని కోరింది.