పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-11-26T00:20:07+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వం తాజా ఊరట కలిగించింది. పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రం ..

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ల గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వం తాజా ఊరట కలిగించింది. పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రం (లైఫ్ సర్టిఫెకెట్స్) సమర్పణ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకూ పొడిగించింది. దీనికి ముందు, లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ తేదీని నవంబర్ 1వ తేదీ నుంచి 2020 డిసెంబర్ 31 వరకూ కేంద్రం పొడిగించింది.


కోవిడ్ వ్యాప్తి, వయోవృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో లైఫ్ సర్టిఫెకెట్లు సమర్పించే గడువు పొడిగించాలంటూ పలు అభ్యర్థనలు వచ్చినట్టు సిబ్బంది, ప్రజా, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదింపుల అనంతరం పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రం సమర్పణ గడువును మరింత పొడిగించాలని నిర్ణయించినట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.


Read more