హోం ఐసోలేషన్ నిబంధనల్లో కీలక మార్పులు

ABN , First Publish Date - 2020-05-11T21:27:40+05:30 IST

కరోనా పేషెంట్ల డిశార్జ్‌కు సంబంధించి ఇటీవల కీలక మార్పులు చేసిన కేంద్రం తాజాగా హోం ఐసోలేష‌న్‌ ప్రోటోకాల్స్‌లో ముఖ్యమైన మార్పులు చేసింది.

హోం ఐసోలేషన్ నిబంధనల్లో కీలక మార్పులు

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల డిశార్జ్‌కు సంబంధించి ఇటీవల కీలక మార్పులు చేసిన కేంద్రం తాజాగా హోం ఐసోలేష‌న్‌ ప్రోటోకాల్స్‌లో ముఖ్యమైన మార్పులు చేసింది. కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు.. రోగ లక్షణాలు కినిపించిన 17 రోజుల తరువాత ఐసోలేషన్ ముగించవచ్చని, అయితే అంతకుమునుపు వరుసగా పది రోజుల పాటు రోగిలో జ్వర లక్షణాలు ఉండరాదని తెలిపింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం..ఐసోలేషన్‌కు స్వస్తి చెప్పేందుకు వైద్యాధికారి అనుమతించాల్సి వచ్చేంది. రోగికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వచ్చేది. దీని ఆధారంగా.. వ్యాధి లక్షణాలన్నీ సద్దుమణిగాయని, కరోనా వైరస్ పూర్తిగా నాశనమైందని వైద్యాధికారి ప్రకటించిన తరువాతే ఐసోలేషన్‌ను ముగించాల్సి వచ్చేది. తాజా మార్పులతో ఇకపై వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2020-05-11T21:27:40+05:30 IST