లాక్‌డౌన్‌లో పిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతి!
ABN , First Publish Date - 2020-04-27T00:14:10+05:30 IST
లాక్‌డౌన్‌లో పిల్లలు బయటకు వెళ్లడానికి స్పెయిన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

మాడ్రిడ్: లాక్‌డౌన్‌లో పిల్లలు బయటకు వెళ్లడానికి స్పెయిన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో మార్చి మధ్య నుంచి ఇక్కడ లాక్‌డౌన్ విధించారు. దీంతో అప్పటి నుంచి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో స్పెయిన్ దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్ని రోజుల తర్వాత పిల్లలు బయటకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రతిరోజూ ఒక గంటసేపు పెద్దల పర్యవేక్షణలో పిల్లలు బయటకు వెళ్లొచ్చని ప్రకటించింది.