వచ్చే ఏడాది జులై వరకూ గూగుల్‌లో వర్క్ ఫ్రం హోం..

ABN , First Publish Date - 2020-07-28T01:44:05+05:30 IST

కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రత కోసం గూగుల్ వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని వచే ఏడాది ద్వితీయార్థం వరకూ పొడిగించినట్టు సమాచారం.

వచ్చే ఏడాది జులై వరకూ గూగుల్‌లో వర్క్ ఫ్రం హోం..

వాషింగ్టన్: కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రత కోసం వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని గూగుల్ వచే ఏడాది ద్వితీయార్థం వరకూ పొడిగించినట్టు సమాచారం. 2021 జులై వరకూ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు గూగుల్ నిర్ణయించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా.. గూగుల్‌లో పనిచేస్తున్న రెండు లక్షల పైచిలుకు ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది లాభపడనున్నారని సమాచారం.  ఈ విషయమై కంపెనీలో గత వారం విస్తృత చర్చ జరిగిన అనంతరం సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వర్క్ ఫ్రం హోం గడువును పొడిగించేందుకు నిర్ణయించారట. అయితే గూగుల్ మాత్రం ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ వార్త రూఢీ అయితే..వర్క్ ఫ్రం హోంను ఈ స్థాయిలో పొడిగించిన తొలి కంపెనీ గూగుల్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-28T01:44:05+05:30 IST