గూగుల్ మ్యాప్స్‌లో.. భోజనం, నైట్ షెల్టర్ల వివరాలు
ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉచిత భోజన కేంద్రాలు, నైట్ షెల్టర్ల వివరాలను పౌరులకు అందజేస్తామని టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చింజన్ల ద్వారా ఈ వివరాలు...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉచిత భోజన కేంద్రాలు, నైట్ షెల్టర్ల వివరాలను పౌరులకు అందజేస్తామని టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చింజన్ల ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చని వివరించింది. ఇప్పటికే 30 నగరాల్లో ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ట్రాఫిక్ విభాగాలు, ఎన్జీవోల సహకారంతో గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్‌ను తీసుకువచ్చామని వివరించింది. త్వరలో ఈ ఫీచర్‌ను హిందీ సహా, అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది.