కదలికలు కనిపెట్టే గూగుల్‌ మ్యాప్స్‌

ABN , First Publish Date - 2020-04-05T05:53:57+05:30 IST

కరోనా కల్లోలంతో ‘భౌతిక దూరం’ పాటించడమనేది ప్రాథమిక ఆరోగ్యసూత్రంగా మారిపోయింది. ఈనేపథ్యంలో భౌతిక దూరం పాటించే విషయంలో ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది 131 దేశాల ప్రభుత్వాలకు తెలియజేసి...

కదలికలు కనిపెట్టే గూగుల్‌ మ్యాప్స్‌

ప్యారిస్‌, ఏప్రిల్‌ 4: కరోనా కల్లోలంతో ‘భౌతిక దూరం’ పాటించడమనేది ప్రాథమిక ఆరోగ్యసూత్రంగా మారిపోయింది. ఈనేపథ్యంలో భౌతిక దూరం పాటించే విషయంలో ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది 131 దేశాల ప్రభుత్వాలకు తెలియజేసి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ‘గూగుల్‌’ శుక్రవారం నుంచి నడుంబిగించింది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్‌ ఉండి, జీమెయిల్‌ ఖాతా కలిగిన వారందరి కదలికలను ‘గూగుల్‌ మ్యాప్స్‌’ ట్రాక్‌ చేసి ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాలకు అందజేస్తుంది. అయితే జీమెయిల్‌ ఖాతాలో ‘లొకేషన్‌ హిస్టరీ’ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకున్న వారి సమాచారాన్ని మా త్రమే గూగుల్‌ పొందగలుగుతుంది. ప్రధానంగా పార్కులు, దుకాణాలు, ఇళ్లు, ఆఫీసులు, ముఖ్య కూడళ్లు, రెస్టారెంట్లు ఇలాంటి ప్రదేశాల్లో రద్దీ ఎలా ఉందనేది ట్రాక్‌ చేస్తుంది. ఈ వివరాల ఆధారంగా అధికారులు వెంటనే అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో రద్దీ తగ్గించేందుకు, ‘భౌతిక దూరం’ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలు కలుగుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌ విభాగానికి నేతృత్వం వహించే ఆ కంపెనీ చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కెరెన్‌ డీసాల్వో ఈమేరకు ఓ పోస్ట్‌ చేశారు. 

Updated Date - 2020-04-05T05:53:57+05:30 IST