కొత్త యూజర్లకు గూగుల్ వెసులుబాటు...

ABN , First Publish Date - 2020-06-25T23:28:46+05:30 IST

గూగుల్‌ను కొత్తగా వినియోగించనున్న యూజర్లకు ఆ సంస్థ ఓ వెసులుబాటు కల్పించింది. వారి లొకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ తదితరాలను కేవలం పద్ధెనిమిది రోజులపాటు చూడడానికి వీలుంటుంది.

కొత్త యూజర్లకు గూగుల్ వెసులుబాటు...

శాన్‌ఫ్రాన్సిస్కో : గూగుల్‌ను కొత్తగా వినియోగించనున్న యూజర్లకు ఆ సంస్థ ఓ వెసులుబాటు కల్పించింది. వారి లొకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ తదితరాలను కేవలం పద్ధెనిమిది రోజులపాటు చూడడానికి వీలుంటుంది.


అవి... ఆ తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ కానున్నాయి. గూగుల్ సెట్టింగుల్లో ఈ మేరకు మార్పులు జరిగాయి. సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్ ఈ వివరాలను తన గూగుల్ బ్లాక‌్‌లో వెల్లడించారు. 


గూగుల్ అక్కౌంట్‌ను కొత్తగా వినియోగించడాన్ని మొదలుపెట్టిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. 

Updated Date - 2020-06-25T23:28:46+05:30 IST