పట్టాలు తప్పిన గూడ్సు రైలు...

ABN , First Publish Date - 2020-11-03T14:34:32+05:30 IST

కస్‌గంజ్ నుంచి కాన్పూర్ వెళుతున్న గూడ్సు రైలు మంగళవారం పాటిలీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పింది....

పట్టాలు తప్పిన గూడ్సు రైలు...

రెండు వారాల్లో రెండు రైలు ప్రమాదాలు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కస్‌గంజ్ నుంచి కాన్పూర్ వెళుతున్న గూడ్సు రైలు మంగళవారం పాటిలీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పింది. గూడ్సురైలు ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో కాన్పూర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్సు రైలు ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు జవాన్లు సంఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఐదు గూడ్సు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గూడ్సు రైలులోని సరుకులను మళ్లించారు. ఈ ప్రమాదం వల్ల కాన్పూర్ -కస్ గంజ్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు వారాల్లో కాన్పూర్ రైలు మార్గంలో గూడ్సు రైలు ప్రమాదాలు రెండు జరిగాయి. వరుస గూడ్సు రైళ్ల ప్రమాదాలపై రైల్వే ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గూడ్సురైలు ప్రమాదాలకు కారణాలపై రైల్వే నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-03T14:34:32+05:30 IST