2 కిలోల బంగారు నగలతో పరార్... చివరికి..
ABN , First Publish Date - 2020-10-27T16:14:10+05:30 IST
రెండు కిలోల నగలతో ఉడా యించిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టి.నగర్ బస్టాండ్ సమీపంలో ఉన్న మూసా వీధిలోని ఉత్తమ్ జ్యువెలరీలో ఈ నెల 20వ తేది రెండు కిలోల నగలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ముఖానికి ముసుగు వేసుకున్న వ్యక్తి చేసిన చోరీకి...

చెన్నై : రెండు కిలోల నగలతో ఉడా యించిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టి.నగర్ బస్టాండ్ సమీపంలో ఉన్న మూసా వీధిలోని ఉత్తమ్ జ్యువెలరీలో ఈ నెల 20వ తేది రెండు కిలోల నగలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ముఖానికి ముసుగు వేసుకున్న వ్యక్తి చేసిన చోరీకి సంబంధించిన 40 నిమిషాల సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ వ్యక్తి ముఖం తెలియకపోవడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. నిందితుడి పేరు కార్తీ అని భావించిన పోలీసులు, ఆయన ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో నిందితుడి పేరు కార్తీ కాదని సురేష్ అని తెలిసింది. తిరువళ్లూర్ సమీపంలోని పుట్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో తలదాచుకున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కడంబత్తూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.