త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా: అమిత్‌షా

ABN , First Publish Date - 2020-03-16T09:21:07+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు నిర్ణీత సమయం కంటే ముందే రాష్ట్ర హోదాను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా...

త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా: అమిత్‌షా

న్యూఢిల్లీ, మార్చి 15: జమ్మూకశ్మీర్‌కు నిర్ణీత సమయం కంటే ముందే రాష్ట్ర హోదాను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉద్ఘాటించారు. ఆ రాష్ట్రానికి చెందిన అప్నీ పార్టీ నేతలు ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర హోదా ఇచ్చేప్పుడు.. నైసర్గిక స్వరూపంలో మార్పు రానివ్వమని, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య తగ్గేలా చూస్తామని ఈ సందర్భంగా అమిత్‌ షా వారితో అన్నారు.

Updated Date - 2020-03-16T09:21:07+05:30 IST