కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారిన మ‌సీదు!

ABN , First Publish Date - 2020-07-20T14:48:24+05:30 IST

గుజరాత్‌లో క‌రోనా వైరస్ అంత‌కంత‌కూ వ్యాప్తి చెందుతోంది. ఈ నేప‌ధ్యంలో గోద్రాలోని ఒక మసీదు కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారింది. ఈ మసీదులోని...

కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారిన మ‌సీదు!

వడోదర: గుజరాత్‌లో క‌రోనా వైరస్ అంత‌కంత‌కూ వ్యాప్తి చెందుతోంది. ఈ నేప‌ధ్యంలో గోద్రాలోని ఒక మసీదు కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారింది. ఈ మసీదులోని ఒక ఫ్లోర్‌ను క‌రోనా బాధితుల కోసం కేటాయించారు. ఇక్క‌డ ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన 9 మంది కరోనా బాధితులు కూడా చికిత్స పొందుతున్నారు. ఈ మసీదులోని గ్రౌండ్ ఫ్లోర్‌ను ముస్లిం మహిళల కోసం రూపొందించారు. మహిళలు ఇక్కడ ఉండటానికి అన్ని వ‌స‌తులు క‌ల్పించారు. ఇప్పుడు దీనినే కోవిడ్ -19 కేర్ సెంటర్‌గా మార్చారు. గుజరాత్‌లో పెరుగుతున్న కరోనా రోగుల దృష్ట్యా మసీదు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-07-20T14:48:24+05:30 IST