'కోవిడ్-లొకేటర్' యాప్ తెచ్చిన గోవా సర్కార్

ABN , First Publish Date - 2020-04-05T20:35:56+05:30 IST

గోవా ప్రభుత్వం 'కోవిడ్-లొకేటర్' యాప్‌ను ఆదివారంనాడు తీసుకువచ్చింది. జీపీఎస్ ఆధారిత లొకేషన్ ట్రాకర్‌గా ఇది ఉపయోగ...

'కోవిడ్-లొకేటర్' యాప్ తెచ్చిన గోవా సర్కార్

పనజి: గోవా ప్రభుత్వం 'కోవిడ్-లొకేటర్' యాప్‌ను ఆదివారంనాడు తీసుకువచ్చింది. జీపీఎస్ ఆధారిత లొకేషన్ ట్రాకర్‌గా ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా హోం క్వారంటైన్‌లో ఉన్న వారి జాడ, కదలికలను తెలుసుకోవచ్చు. కోవిడ్-19 మరింత విస్తరించకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకువచ్చిందని, హోం క్వారంటెన్ పేషంట్ల జాడ గుర్తించడం ద్వారా ఇతరులకు వ్యాధి విస్తరించకుండా కాపాడేందుకు  వీలుటుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇంటుజిన్ కొలాబొరేషన్‌తో ఈ యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆండ్రాయిట్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. కాగా, గోవాలో ఇంతవరకూ 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-05T20:35:56+05:30 IST