అరుదైన తాబేళ్లను కాపాడిన జాలర్లకు సీఎం ప్రశంసలు..

ABN , First Publish Date - 2020-06-22T17:13:00+05:30 IST

గోవా తీరంలో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లను కాపాడిన కొందరు స్థానిక జాలర్లపై ముఖ్యమంత్రి...

అరుదైన తాబేళ్లను కాపాడిన జాలర్లకు సీఎం ప్రశంసలు..

పనాజీ: గోవా తీరంలో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లను కాపాడిన కొందరు స్థానిక జాలర్లపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రశంసలు కురిపించారు. ప్రకృతి జీవావరణ వ్యవస్థపై వారికి ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందంటూ ఆయన కొనియాడారు. ‘‘ప్రకృతి జీవావరణాన్ని గౌరవిస్తూ మన రాష్ట్రాన్ని అత్యంత ఆవాస యోగ్యంగా చేస్తున్న నా గోవా సోదరులకు కృతజ్ఞతలు..’’ అని సీఎం ట్వీట్ చేశారు. జాలర్లు వలల నుంచి తాబేళ్లను విడిపిస్తున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. శుక్రవారం దక్షిణ గోవాలోని బెలాలిం బీచ్‌లో నలుగురు జాలర్లు తమ వలల్లో చిక్కిన అరుదైన తాబేళ్లను తిరిగి సముద్రంలోకి వదిలేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చర్చిల్ అలెమవో సైతం జాలర్లను ప్రశంసించారు. Updated Date - 2020-06-22T17:13:00+05:30 IST