కోవిడ్‌ కట్టడిలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ABN , First Publish Date - 2020-05-12T00:48:59+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఇండియా సాధించిన విజయం అంతర్జాతీయ గుర్తింపు పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ..

కోవిడ్‌ కట్టడిలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఇండియా సాధించిన విజయం అంతర్జాతీయ గుర్తింపు పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. కలిసికట్టుగా మరింత ముందుకు వెళ్లడంపైనే ప్రస్తుతం దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సోమవారంనాడు మాట్లాడారు. దేశవ్యాప్త కోవిడ్ లాక్‌డౌన్ క్రమంలో సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ జరపడం ఇది ఐదోసారి.


కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో జిల్లా స్థాయి వరకూ ఏ విధంగా వ్యవహరించాలనే విషయంలో గత కొద్ది వారాలుగా అధికారులకు కూడా ఒక అవగాహన వచ్చిందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. కోవిడ్ ప్రస్తుత పరిస్థితిని, తీసుకోవాల్సిన చర్యలపై కాబినెట్ కార్యదర్శి ఆదివారంనాడు కూడా చీఫ్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలతో సమీక్షించారని, ఆ క్రమంలోనే ముఖ్యమంత్రులతో మాట్లాడేందుకు ఇప్పుడు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.


షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్త లాక్‌డౌన్ ఈనెల 17వ తేదీతో ముగియాల్సి ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ముందు మార్చి 20, ఏప్రిల్ 2, ఏప్రిల్ 11, ఏప్రిల్ 27 తేదీల్లో సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ జరిపి కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించారు. లాక్‌డౌన్ కొనసాగిస్తూ వచ్చారు.

Updated Date - 2020-05-12T00:48:59+05:30 IST