మరింత సమాచారం ఇవ్వండి
ABN , First Publish Date - 2020-12-10T07:29:50+05:30 IST
భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌లు తమ కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులను కోరుతూ చేసిన దరఖాస్తులను కేంద్ర

భారత్ బయోటెక్, సీరంలకు ‘సీడీఎ్‌ససీఓ’ కమిటీ నిర్దేశం
న్యూఢిల్లీ, డిసెంబరు 9 : భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌లు తమ కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులను కోరుతూ చేసిన దరఖాస్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించింది. వ్యాక్సిన్ కేండిడేట్ల నుంచి లభిం చే ఆరోగ్య భద్రత, ప్రభావశీలతలపై అదనపు సమాచారాన్ని ఇవ్వాలని ఆ రెండు కంపెనీలను కోరింది.
ఇక ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తో దేశంలో నిర్వహిస్తున్న రెండు, మూడోదశ ప్రయోగ పరీక్షల ఆరోగ్య భద్రతా వివరాల తాజా సమాచారాన్ని అందించాలని ‘సీరం’కు కమిటీ నిర్దేశించింది. అయితే నిపుణుల కమిటీ ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చేందుకు గడువు కావాలని ఫైజర్ కంపెనీ కోరడంతో.. ఆ దరఖాస్తు పరిశీలనను వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.