కొవిడ్ కేర్ నుంచి తీసుకెళ్లి..
ABN , First Publish Date - 2020-12-07T08:21:48+05:30 IST
కొవిడ్ ఆసుపత్రిలోని బాలికను మాయమాటలు చెప్పి బయటికి తీసుకెళ్లి వార్డుబాయ్‌తోపాటు, మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. కర్ణాటకలోని శివమొగ్గలో శనివారం రాత్రి ఈ ఘోరం జరిగింది...

- బాలికపై సామూహిక అత్యాచారం
- వార్డుబాయ్ సహా ముగ్గురి అరెస్టు.. కర్ణాటకలో ఘోరం
బెంగళూరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కొవిడ్ ఆసుపత్రిలోని బాలికను మాయమాటలు చెప్పి బయటికి తీసుకెళ్లి వార్డుబాయ్‌తోపాటు, మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. కర్ణాటకలోని శివమొగ్గలో శనివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. కరోనాతో బాధపడుతున్న తల్లికి సేవలందిస్తూ దాదాపు నెల రోజులుగా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలోనే బాలిక ఉంటోంది. వార్డుబాయ్ మనోజ్ ఆ బాలికతో పరిచయం పెంచుకొని హోటల్ నుంచి భోజనం, టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. శివమొగ్గలో మూడు రోజులుగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీంతో హోటల్ నుంచి భోజనం తెచ్చేందుకు తనవెంట రావాలని శనివారం రాత్రి వార్డుబాయ్ మనోజ్ చెప్పడంతో బాలిక అతడి వెంట వెళ్లింది. కారులో బయటకు తీసుకెళ్లిన మనోజ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని స్నేహితులు ప్రజ్వల్, వినయ్‌తోపాటు మరో యువకుడు కూడా రాత్రంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.