తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కండి.. అది వచ్చి తీరుతుంది!

ABN , First Publish Date - 2020-03-24T01:37:27+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి అలముకున్న నేపథ్యంలో రాబోయే తుఫానుకు సిద్ధంగా ఉండాలని ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ నెస్లే తన ఉద్యోగులను హెచ్చరించింది.

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కండి.. అది వచ్చి తీరుతుంది!

జ్యూరిక్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి అలముకున్న నేపథ్యంలో రాబోయే తుఫానుకు సిద్ధంగా ఉండాలని ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ నెస్లే తన ఉద్యోగులను హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ మార్క్ ష్ణైడర్ నెస్లే ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. ‘ఇది మరింతగా శ్రమించాల్సిన సమయం. తుఫాన్‌ను ఎదుర్కొంనేందుకు సిద్ధం కండి. అది వచ్చితీరుతుంది’ అని ఉద్యోగులకు ఉద్దేశించిన అంతర్గత లేఖలో వ్యాఖ్యానించారు.


ఈ క్లిష్ట పరిస్థితుల్లో వినియోగదారులకు అవసరమైన ఆహరా పదార్థాలు, పానీయాలను నిరంతరంగా సరఫరా చేసేందుకు ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. నెస్‌కేఫ్ కాఫీ, మ్యాగీ నూడుల్స్ వంటి బ్రాండ్లకు నెస్లేకు చెందినవన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2.9 లక్షల మంది నెస్లేలో పనిచేస్తున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో వ్యాపారం నిరంతరాయంగా కొనసాగడానికి క్షేత్రస్థాయిలో ఉండే ఉద్యోగుల నిబద్ధత ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ముడిసరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటూ ఉత్పత్తుల తయారీ, రవాణాను పటిష్ట పరచడం ఎంతో ముఖ్యమని తెలిపారు. 

Updated Date - 2020-03-24T01:37:27+05:30 IST