కరోనా కట్టడి చర్యల ప్రభావాన్ని అంచనా వేసేందుకు సరికొత్త పద్ధతి

ABN , First Publish Date - 2020-05-18T09:02:34+05:30 IST

కరోనా కట్టడికి ప్రపంచదేశాల ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌ల అమలు, భౌతిక దూరం పాటించేలా ప్రజలను ప్రోత్సహించడం, జనం ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశమున్న...

కరోనా కట్టడి చర్యల ప్రభావాన్ని అంచనా వేసేందుకు సరికొత్త పద్ధతి

బెర్లిన్‌, మే 17 : కరోనా కట్టడికి ప్రపంచదేశాల ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌ల అమలు, భౌతిక దూరం పాటించేలా ప్రజలను ప్రోత్సహించడం, జనం ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశమున్న వ్యాపారాల మూసివేత వంటివన్నీ ఆ కోవలోకే వస్తాయి. ఇవన్నీ అమలు చేయడంతో కరోనా వ్యాప్తి ఎంతమేర అదుపులోకి వచ్చింది? ఏయే చర్యలు ఎంతమేర ఫలితమిచ్చాయి ? అనేది అంచనా వేసేందుకు సరికొత్త కంప్యూటర్‌ విశ్లేషణా పద్ధతిని అభివృద్ధిచేసినట్లు జర్మనీలోని గాటింజెన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మార్చి రెండోవారం నుంచి మే 11 వరకు జర్మనీలో కరోనా వ్యాప్తి తీరుతెన్నుల విశ్లేషణకు ఈ పద్ధతిని వాడినట్లు తెలిపారు. ఇతర ప్రపంచదేశాలూ దీన్ని వాడుకునేలా జీఐటీహబ్‌ వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచామన్నారు. 


Updated Date - 2020-05-18T09:02:34+05:30 IST