ట్రంప్‌పై మండిపడ్డ జర్మనీ! ఇది పద్ధతి కాదంటూ..

ABN , First Publish Date - 2020-05-31T00:44:41+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా అన్ని సంబంధాలు తెంచుకుందని ప్రకటించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జర్మనీ మండిపడింది.

ట్రంప్‌పై మండిపడ్డ జర్మనీ! ఇది పద్ధతి కాదంటూ..

బెర్లిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా అన్ని సంబంధాలు తెంచుకుందని ప్రకటించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జర్మనీ మండిపడింది. ఇది ఎంతో విచారకరమన్న జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి.. ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి పెద్ద దెబ్బ అని కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు.. డబ్ల్యూహెచ్‌ఓలో సంస్కరణలు రావాల్సి ఉందని కూడా మంత్రి అభిప్రాపడ్డారు. ప్రస్తుత కాలంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రభావం చూపించేందుకు ఈ మర్పులు అవసరమని కూడా కామెంట్ చేశారు. ఈ సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు ఐరోపా సమాఖ్య పగ్గాలు చేపట్టాలని కూడా అభిప్రాయపడ్డారు. ఐరోపా సమాఖ్య అధ్యక్ష పదివి జర్మనీ చేతుల్లోకి వచ్చాకు సంస్థలో సంస్కరణలకు ప్రాధాన్యమిస్తామని కూడా స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు సంస్థకు తాత్కాలికంగా నిధులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వతమవుతుందని కూడా కొంత కాలం తరువాత హెచ్చరించారు. తాజాగా డబ్ల్యూహెచ్‌తో అన్ని సంబంధాలనూ అమెరికా తెంచేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు.

Updated Date - 2020-05-31T00:44:41+05:30 IST