జర్మనీలో మళ్లీ లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-11-03T07:14:00+05:30 IST

ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జర్మనీ మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించింది...

జర్మనీలో మళ్లీ లాక్‌డౌన్‌!

ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జర్మనీ మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 19 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. ఇక, బ్రిటన్‌ ప్రిన్స్‌ విలియమ్‌కు ఏప్రిల్‌లోనే కరోనా పాజిటివ్‌ వచ్చిందని, కానీ.. దాన్ని ఆయన దాచిపెట్టారని యూకే మీడియా సోమవారం బయటపెట్టింది. ఈ కథనంపై స్పందించేందుకు లండన్‌లోని కింగ్‌స్టన్‌ ప్యాలెస్‌ కార్యాలయం నిరాకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తనతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో తాను క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-11-03T07:14:00+05:30 IST