జర్మనీ దేశాధినేతకు కరోనా నెగిటీవ్
ABN , First Publish Date - 2020-03-24T22:38:45+05:30 IST
కొవిడ్-19 మరింత విజృంభించకుండా జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనసమూహాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన జర్మనీ

బెర్లిన్: జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు కరోనా (కోవిడ్-19) పరీక్ష నిర్వహించగా నెగిటీవ్ వచ్చిందని ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. దేశంలో కరోనా విజృంభనతో దేశంలో అనేక ఆంక్షలు విధించి ఆమె ఆదివారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా మంగళవారం కోవిడ్-19 టెస్ట్ చేసుకోగా నెగిటీవ్‌గా వచ్చిందని ప్రభుత్వ ప్రతినిధి స్టీఫెన్ సీబెర్ట్ తెలిపారు.
కొవిడ్-19 మరింత విజృంభించకుండా జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనసమూహాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన జర్మనీ.. తాజాగా ఇద్దరికి మించి ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశాలు జారీ చేసింది. విద్యాలయాలు, షాపింగ్ మాల్స్ ఇప్పటికే మూతపడ్డాయి.
కరోనా (కోవిడ్-19) ప్రపంచ మహమ్మారిగా మారిపోయింది. ఈ వైరస్ ఆధీనంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 శాతం మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.