లాక్‌డౌన్ కారణంగా చెత్త ఉత్పత్తి 40 శాతం తగ్గింది...

ABN , First Publish Date - 2020-05-13T14:43:06+05:30 IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో నగరాల్లో చెత్త ఉత్పత్తి గణనీయంగా తగ్గింది....

లాక్‌డౌన్ కారణంగా చెత్త ఉత్పత్తి 40 శాతం తగ్గింది...

తిరుచిరాపల్లి (కేరళ) : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో నగరాల్లో చెత్త ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కేరళ రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరంలో చెత్త ఉత్పత్తి 40 శాతం తగ్గిందని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పరిశీలనలో వెల్లడైంది. తిరుచిరాపల్లి నగరంలో రోజుకు సాధారణంగా 460 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. నగరంలో చెత్త పేపర్లు, ఆహారవ్యర్థాలు, ప్లాస్టిక్ కాగితాలు కలిపి 51 శాతం ఉత్పత్తి అవుతోంది.పాత టైర్లు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తుంటారు. తిరుచ్చి నగరంలోని శ్రీరంగం, గాంధీ మార్కెట్ తదితర ప్రాంతాలన్నీ కలిపి మార్చి 25వతేదీన 460 టన్నుల చెత్త లభించింది. లాక్ డౌన్ వల్ల మార్కెట్లతోపాటు ఇళ్లలోని చెత్త తగ్గింది. లాక్ డౌన్ సమయంలో రోజుకు 270 టన్నుల చెత్త మాత్రమే సేకరిస్తున్నారు. నగరంలో రెస్టారెంట్లు, హోటళ్లు, ఆఫీసు కార్యాలయాలు మూతపడటంతో చెత్త ఉత్పత్తి తగ్గిందని సిటీ ఇంజినీరు అమృతవల్లి చెప్పారు. ఇళ్లలోని చెత్తను 32 మైక్రో కంపోస్టు యార్డులకు తరలిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-05-13T14:43:06+05:30 IST