ప్రముఖుల హత్యకు ఛోటా షకీల్ కుట్ర!
ABN , First Publish Date - 2020-02-08T09:33:04+05:30 IST
ఢిల్లీలోనూ, పొరుగున ఉన్న రాష్ట్రాల్లోనూ రాజకీయ, సామాజిక ప్రముఖులను, న్యాయమూర్తులను హత్య చేసేందుకు ..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఢిల్లీలోనూ, పొరుగున ఉన్న రాష్ట్రాల్లోనూ రాజకీయ, సామాజిక ప్రముఖులను, న్యాయమూర్తులను హత్య చేసేందుకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్‌పై కేసు నమోదైంది. ఈ హత్యల కోసం దావూద్ ఇబ్రహీం ముఠా ఛోటా షకీల్‌కు అత్యాధునిక ఆయుధాలను కూడా అందజేసినట్లు సమాచారం. ఓ పోలీసు అధికారికి విశ్వసనీయంగా అం దిన సమాచారం మేరకు జనవరి 27న ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షకీల్ ఎక్కడున్నదీ పోలీసులకు తెలియకపోయినా కరాచీ శివార్లలో ఉన్నట్లు ఓ కథనం. 2017లో అతను గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలొచ్చినా అవి నిజం కాదని తేలింది.