ముస్లిం దేశ అధికారిక కరెన్సీపై గణేశుడి బొమ్మ

ABN , First Publish Date - 2020-08-22T16:02:03+05:30 IST

ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు నివసించే దేశం ఇండోనేషియా. అలాంటి ఇండోనేషియా

ముస్లిం దేశ అధికారిక కరెన్సీపై గణేశుడి బొమ్మ

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు నివసించే దేశం ఇండోనేషియా. అలాంటి ఇండోనేషియా అధికారిక కరెన్సీపై గణేశుడి బొమ్మను ఆ దేశం ముద్రిస్తుంది. ఇంతటి ముస్లిం దేశంలోని కరెన్సీపై గణేశుడి బొమ్మను ముద్రించడం ఆశ్చర్యం గొలిపే విషయం. ఇండోనేషియా సంస్కృతి, మన దేశ సంస్కృతి కాస్త దగ్గరిగానే ఉంటుంది. మన దేశంలో లాగే అక్కడ కూడా హిందూ దేవతల ఆరాధన ఉంటుంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నా... హిందూ మతం ప్రభావం మాత్రం స్పష్టంగా గోచరిస్తూనే ఉంటుంది. గణేశుడు బుద్ధికి సంకేతం.


చాలా సంవత్సరాల క్రితం ఇండోనేషియాల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. దీంతో అక్కడి ఆర్థిక వేత్తలు ఓ బృందంగా ఏర్పడి చర్చోప చర్చలు చేశారు. చివరికి... బుద్ధికి సంకేతం.. వినాయకుడి... అందుకే కరెన్సీపై వినాయకుడి బొమ్మను ముద్రిద్దామని ఆ బృందం డిసైడ్ అయినట్లు ఇండోనేషియా స్థానికులు పేర్కొంటున్నారు.


అయితే 1998 సంవత్సరంలో ఆ దేశంలో 20 వేల రూపాయల కొత్త నోట్లను ముద్రించడం ప్రారంభించారు. అప్పటి నుంచి గణేశుడి ఫొటోను తొలగించి.. కరెన్సీ నోటును ముద్రించడం ప్రారంభించారు. 

Updated Date - 2020-08-22T16:02:03+05:30 IST